Header Banner

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు..! తెలుగు ప్రభుత్వాలు అలర్ట్!

  Fri May 09, 2025 18:24        India

పాకిస్తాన్‌, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూ, శ్రీనగర్, పంజాబ్ యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది చదువుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ శ్రీనగర్, పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులతోపాటు తెలుగువారి కోసం ఢిల్లీ ఏపీ భవన్‌లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

టోల్ ఫ్రీ నెంబర్లకు పలువురు విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల నుంచి ఏపీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 25 ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పంజాబ్ జమ్మూ కశ్మీర్‌లో యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులను బయటకు వెళ్లకుండా కేంద్రం ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. అత్యవసరమైతే విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ భవన్‌లో సమాచారం అందించడానికి ఎంవీఎస్ రామారావు డిప్యూటీ కమిషనర్, సురేష్ బాబు లైజన్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారు. సమాచారం కోసం ఈ నెంబర్‌లో 9818395787 సంప్రదించాలని కోరారు.

తెలంగాణ ప్రజల కోసం..

పాకిస్తాన్‌, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. సమాచారం కోసం ప్రత్యేకంగా నెంబర్లను కేటాయించారు. ఈ నెంబర్లలో సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

వివరాల కోసం..

  • ల్యాండ్‌లైన్: 011-23380556

  • వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ, లైజన్ హెడ్ – 9871999044

  • హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు – 9971387500

  • జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – 9643723157

  • సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 9949351270


ఇది కూడా చదవండి: పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలు.. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా! కొత్త షెడ్యూల్‌ త్వరలో..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaPakistanTensions #TeluguStatesAlert #APGovt #TSGovt #StudentSafety #IndoPakBorder #ControlRoom